Kriti Sanon: మొదటిసారి పచ్చబొట్టు.. టాటూ వెనుక సీక్రెట్ చెప్పిన స్టార్‌ హీరోయిన్

Kriti Sanon Reveals Secret Behind First Tattoo
  • మొదటిసారి పచ్చబొట్టు వేయించుకున్న నటి కృతి సనన్
  • కాలు మీద ఎగిరే పక్షి టాటూతో పాటు స్ఫూర్తిదాయక సందేశం
  • స్వేచ్ఛగా జీవించాలనే తన ఆశయానికి ఇది ప్రతీక అని వెల్లడి
  • సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన బ్యూటీ
  • వైరల్ అవుతున్న పోస్ట్.. ప్రశంసిస్తున్న అభిమానులు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ కృతి సనన్ తన జీవితంలో తొలిసారి పచ్చబొట్టు వేయించుకున్నారు. కేవలం ఫ్యాషన్ కోసం కాకుండా, తన జీవిత ఆశయానికి, స్వేచ్ఛకు ప్రతీకగా నిలిచే ఓ ప్రత్యేకమైన టాటూతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. దీనికి సంబంధించిన ఫొటోలను, దాని వెనుక ఉన్న లోతైన అర్థాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు.

తన కాలిపై ఎగిరే పక్షి ఆకారాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్న కృతి, దాని కింద స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని కూడా పొందుపరిచారు. ఈ టాటూ వెనుక ఉన్న భావాన్ని వివరిస్తూ, “పచ్చబొట్టు వేయించుకుంటానని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు నా వాగ్దానం నెరవేరింది. ఈ పక్షిలాగే నేను కూడా స్వేచ్ఛగా, సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ జీవించాలనుకుంటున్నాను. కళ్లలో కలలు ఉన్నవారు, మీరు భయపడే ఎత్తును కూడా స్వీకరించాలి. మార్గం సులభం కాకపోయినా, మీ దారి మీరే కనుగొని ఎగరడం నేర్చుకోవాలి” అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.

ప్రస్తుతం కృతి పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఆత్మవిశ్వాసానికి, స్ఫూర్తిదాయక ఆలోచనలకు అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మహేశ్‌ బాబు సరసన ‘1 నేనొక్కడినే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కృతి సనన్, ఆ తర్వాత ‘దోచేయ్’, ప్రభాస్‌తో కలిసి నటించిన ‘ఆదిపురుష్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా, గతంలో ప్రభాస్‌తో ప్రేమలో ఉన్నారంటూ వచ్చిన వార్తలను ఆమె ఖండించిన విషయం తెలిసిందే. అయితే, బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం కృతి త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని ప్రచారం జరుగుతోంది.
Kriti Sanon
Kriti Sanon tattoo
Bollywood actress
Adipurush movie
Telugu movies
1 Nenokkadine
Prabhas Adipurush
Kriti Sanon wedding
actress tattoo
Dochey movie

More Telugu News