Mahikaa Sharma: హార్దిక్ పాండ్యాతో ప్రేమాయణం?.. ఎవరీ మహికాశర్మ?

Hardik Pandya rumored to be dating Mahieka Sharma
  • ప్రముఖ మోడల్ మహికా శర్మతో హార్దిక్ డేటింగ్ అంటూ ప్రచారం
  • మహికా పోస్ట్ చేసిన వీడియోతో సోషల్ మీడియాలో చర్చ
  • ఇటీవలే భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడిపోయిన హార్దిక్
  • ఈ వార్తలపై ఇంకా స్పందించని హార్దిక్, మహికా
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి తన ఆటతో కాదు, వ్యక్తిగత జీవితం గురించి. మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడిపోయిన కొద్దికాలానికే ప్రముఖ మోడల్ మహికాశర్మతో ప్రేమలో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మహికాశర్మ పోస్ట్ చేసిన ఒక సెల్ఫీ వీడియో ఈ ఊహాగానాలకు కారణమైంది. ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో అస్పష్టంగా కనిపిస్తున్న వ్యక్తి హార్దిక్ పాండ్యానేనని కొందరు నెటిజన్లు రెడిట్‌లో చర్చ మొదలుపెట్టడంతో ఈ వార్త వైరల్‌గా మారింది. అయితే, ఈ పుకార్లపై హార్దిక్ గానీ, మహికా గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. దీంతో ఈ వార్తల్లో నిజమెంత అనే దానిపై ఆసక్తి నెలకొంది.

ఎవరీ మహికాశర్మ?
ఎకనామిక్స్, ఫైనాన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన మహికాశర్మ ఆ తర్వాత మోడలింగ్, నటన రంగంలోకి అడుగుపెట్టింది. తనిష్క్, వివో, యునిక్లో వంటి ప్రముఖ బ్రాండ్ల వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. మనీష్ మల్హోత్రా, అనితా డోంగ్రే, తరుణ్ తహిలియాని వంటి టాప్ డిజైనర్ల కోసం ర్యాంప్ వాక్ కూడా చేసింది. 2024లో జరిగిన ఇండియన్ ఫ్యాషన్ అవార్డులలో 'మోడల్ ఆఫ్ ది ఇయర్ (న్యూ ఏజ్)' పురస్కారాన్ని కూడా అందుకుంది. వృత్తి పట్ల ఆమెకున్న నిబద్ధతకు మంచి పేరుంది. ఒక ఫ్యాషన్ షోకు ముందు కంటికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకినప్పటికీ, నొప్పిని భరిస్తూనే ఆమె ర్యాంప్ వాక్ పూర్తి చేసింది.

హార్దిక్ పాండ్యా ఇటీవల తన భార్య, సెర్బియన్ మోడల్ నటాషా స్టాంకోవిచ్‌తో విడిపోయిన విషయం తెలిసిందే. 2020 మేలో వివాహం చేసుకున్న ఈ జంట, 2023 ఫిబ్రవరిలో మరోసారి ఘనంగా పెళ్లి వేడుక జరుపుకొంది. కానీ, విభేదాల కారణంగా గతేడాది జులైలో తాము విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమ కుమారుడు అగస్త్య కోసం కలిసే బాధ్యతలు నిర్వర్తిస్తామని వారు తమ ప్రకటనలో తెలిపారు.
Mahikaa Sharma
Hardik Pandya
Natasa Stankovic
Indian model
model of the year
Hardik Pandya divorce
cricketer
Bollywood
relationship rumors

More Telugu News