Gajwel: గజ్వేల్ లో ఒకే కాలనీకి ఆరు పేర్లు

Gajwel Colony Six Names Reflect Caste Divisions
  • వీధి మొదట్లో రాత్రికి రాత్రే వెలిసిన నేమ్ బోర్డులు
  • ఉన్నదే 25 ఇళ్లు.. కానీ కాలనీకి మాత్రం ఆరు పేర్లు
  • నాడు వినాయక నగర్.. నేడు కులానికి ఓ పేరు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఓ కాలనీలో రాత్రికి రాత్రే కొత్త నేమ్ బోర్డులు వెలిశాయి. కాలనీలో ఉన్నదే 25 ఇళ్లు.. కానీ కులానికో పేరు చొప్పున కాలనీ మొదట్లో ఆరు నేమ్ బోర్డులను ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఓ వివాదం నేపథ్యంలో కుల విభేదాలు పొడసూపడమే దీనికి కారణమని తెలుస్తోంది. మొదటి నుంచీ ‘వినాయక నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అని పిలుస్తున్న ఆ కాలనీని ప్రస్తుతం ఎవరి కులాన్ని బట్టి వారు ప్రత్యేకంగా పేరు పెట్టుకున్నారు.

గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీపంలో ముట్రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి రోడ్డు పక్కన వినాయక నగర్ కాలనీ ఉంది. ఇక్కడి కుటుంబాలలో 70 శాతం ఒకే సామాజికవర్గం కాగా మిగతా 30 శాతం వివిధ సామాజిక వర్గాల వారు ఉన్నారు. కాలనీ ఏర్పాటైన కొత్తలో ‘వినాయక నగర్’ అని నామకరణం చేసుకున్నారు. అయితే, ఇటీవల జరిగిన ఓ గొడవతో కాలనీలో కుల విభేదాలు పొడసూపాయి.

దీంతో మెజార్టీ సామాజిక వర్గం ఈ కాలనీకి తమ కులం పేరుతో నేమ్ బోర్డు ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై మిగతా కులాల వారు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. దీంతో మిగతా కులాల కుటుంబాలు కూడా తమ కులాల పేర్లతో రెడ్డి ఎన్ క్లేవ్, ఆర్యవైశ్య ఎన్ క్లేవ్, ముదిరాజ్ ఎన్ క్లేవ్, విశ్వకర్మ ఎన్ క్లేవ్, యాదవ్స్ ఎన్ క్లేవ్ పేర్లతో నేమ్ బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు. వీధి మొదట్లో ఆరు నేమ్ బోర్డులు కనిపించడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
Gajwel
Siddipet district
Vinayaka Nagar
caste discrimination
name boards
Mutrajpally road
Reddy Enclave
Arya Vysya Enclave
Mudiraj Enclave
Vishwakarma Enclave
Yadav Enclave

More Telugu News