తిరుమల శ్రీవారికి విద్యుత్ వాహనం అందజేసిన టివోల్ట్ కంపెనీ
––
బెంగుళూరుకు చెందిన టివోల్ట్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తిరుమల శ్రీవారికి విద్యుత్ వాహనాన్ని విరాళంగా అందజేసింది. సోమవారం మొంట్రా ఎలక్ట్రిక్ ఏవియేటర్ వాహనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులకు కంపెనీ ప్రతినిధులు అందజేశారు. రూ.15,94,962 విలువైన ఈ వాహనానికి సోమవారం శ్రీవారి ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంస్థ ప్రతినిధులు వాహనం తాళాలను శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.