'మిరాయ్' మూవీలోని హైలైట్స్ ఇవే!

  • శుక్రవారం విడుదలైన 'మిరాయ్'
  • తొలి ఆటతోనే దక్కిన హిట్ టాక్ 
  • భారీ వసూళ్లతో దూసుకుపోతున్న సినిమా 
  • పిల్లలను సైతం ఆకట్టుకుంటున్న కంటెంట్ 
 
ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా 'మిరాయ్' సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. పిల్లలను కూడా ఈ సినిమా విశేషంగా ఆకర్షిస్తూ ఉండటం .. ఆకట్టుకుంటూ ఉండటం బాగా కలిసొచ్చింది. దాంతో విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా వసూళ్ల జోరు కొనసాగుతోంది. ఈ సినిమాలో లవ్ లేదు .. రొమాన్స్ లేదు .. డ్యూయెట్లు లేవు. అయినా వాటిని గురించి ఆడియన్స్ ఆలోచన చేయరు .. ఎదురు చూడరు. అందుకు కారణం డిజైన్ చేసిన కంటెంట్ పెర్ఫెక్ట్ గా ఉండటమే. 

ప్రధానమైన పాత్రలు .. కథా కథనాలు .. అందుకు తగిన విజువల్స్ .. లొకేషన్స్ ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయి. ఒక సినిమాకి ఇంటర్వెల్ బ్యాంగ్ .. క్లైమాక్స్ చాలా ముఖ్యమైన అంశాలు. మిగతా కథ అంతా కూడా వీటిపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటి ఆ రెండు కీలకమైన సన్నివేశాలను తెరపై ఆవిష్కరించడంతోనే ఈ సినిమా సక్సెస్ వైపు నడిచింది. అలాగే 'తంత్రవనం' .. 'అమరగ్రంథం' .. 'అంగమ్మబాలి' అనే పేర్లు మరింత బలంగా ప్రేక్షకులను కథలోకి లాగేస్తాయి. 

ఈ సినిమాలో జటాయువు పక్షి సోదరుడైన 'సంపాతి' ఎపిసోడ్, పిల్లలను థియేటర్ కి రప్పించడంలో ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. గ్రాఫిక్స్ పరంగా ఈ ఎపిపోడ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా కనిపిస్తుంది. అలాగే 'మిరాయ్' ఆయుధంతో హీరో చేసే ఫస్టు ఫైట్, ఆ ఆయుధాన్ని ఉపయోగించి రన్నింగ్ ట్రైన్ ను నియంత్రించడం ప్రేక్షకులను అలా కూర్చోబెట్టేస్తుంది. ఇక 'అంగమ్మబాలి' ఎపిసోడ్ లో జగపతిబాబు లుక్ .. నటన, శ్రీరాముడి విల్లు కోదండమే 'మిరాయ్' అంటూ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ ఈ కథకి మరింత బలాన్ని చేకూర్చాయని చెప్పాలి. 



More Telugu News