ప్రాణభయంతో పరుగులు.. ఇంటి పైకప్పుపైకి చేరిన ఎద్దు
- ఆదిలాబాద్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన
- కుక్కల దాడి భయంతో ఇంటి పైకప్పు ఎక్కిన ఎద్దు
- తాళ్ల సహాయంతో సురక్షితంగా కిందకు దించిన స్థానికులు
- ఘటనలో ఓ ఇంటికి స్వల్పంగా నష్టం
ఆదిలాబాద్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. వీధికుక్కల బారి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ ఎద్దు ఏకంగా ఓ ఇంటి పైకప్పుపైకి ఎక్కిన అరుదైన దృశ్యం ఆదివారం చోటుచేసుకుంది. ఈ సంఘటన భోరజ్ మండల పరిధిలోని నిరాల గ్రామంలో జరిగింది.
అసలేం జరిగిందంటే..!
నిరాల గ్రామానికి చెందిన రైతు షేక్ గఫూర్ తన ఎద్దును ఇంటి ఆరుబయట గూటానికి కట్టేశాడు. ఆదివారం ఉదయం కొన్ని కుక్కలు గుంపుగా వచ్చి ఆ ఎద్దుపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆ ఎద్దు, ప్రాణభయంతో కట్టుతాళ్లను తెంచుకుని పరుగులు తీసింది. ఈ క్రమంలో తప్పించుకునేందుకు పక్కనే ఉన్న రాళ్ల కట్టపైకి ఎక్కి, అక్కడి నుంచి నేరుగా ఓ ఇంటి పైకప్పు మీదకు చేరింది.
ఇంటిపై ఎద్దు ఉండటాన్ని చూసి గ్రామస్థులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన విఠల్ మాస్టర్ అనే వ్యక్తి ఇంటికి స్వల్ప నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చాలాసేపు శ్రమించి, తాళ్ల సాయంతో ఎద్దును జాగ్రత్తగా కిందికి దించారు. ఊహించని ఈ పరిణామాన్ని చూసిన పలువురు గ్రామస్థులు తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఆసక్తిని రేపుతున్నాయి.