Srishti Varma: బిగ్ బాస్ సీజన్-9... ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే...!

Srishti Varma Eliminated First From Bigg Boss Telugu 9
  • బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్‌బాస్
  • అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న వైనం
  • తొలి ఎలిమినేషన్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ  
బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌ 9’ సీజన్ తొలి ఎపిసోడ్‌ నుంచే హీట్‌ పెంచింది. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్‌ గత ఆదివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆదివారం (సెప్టెంబర్ 14) నాటి ఎపిసోడ్‌లో తొలి ఎలిమినేషన్ జరగగా, అందులో కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్‌ నుంచి బయటకు వచ్చింది.

ఎలిమినేషన్ అనంతరం నాగార్జున ఆమెతో ఇంటర్వ్యూలో ఆసక్తికర ప్రశ్నలు వేశారు. ‘‘నిజంగా జెన్యూన్‌గా ఉన్నవారు ఎవరు?’’ అన్న ప్రశ్నకు శ్రష్టి సమాధానం ఇస్తూ రాము రాథోడ్, మనీశ్, హరీష్, ఆషా షైనీ పేర్లు చెప్పింది. అదే విధంగా, "కెమెరా ముందే యాక్ట్ చేస్తున్నవాళ్లు ఎవరు?" అన్న ప్రశ్నకు రీతూ చౌదరి, తనూజ, భరణి పేర్లు వెల్లడించింది.

"ఇలాంటి షోలలో అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది" అని బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ప్రవేశించే ముందు శ్రష్టి పేర్కొనగా, ‘‘ఇక్కడ రెండు వారాలు నటించడం సులభం.. కానీ ఆ తర్వాత అసలు రంగు బయటపడుతుంది’’ అంటూ మరింత స్పష్టత ఇచ్చింది.

సామాన్యులకు అధిక ప్రాధాన్యం కల్పించడంతో ఈ కొత్త సీజన్‌ ప్రత్యేకంగా నిలిచింది. మొత్తం 15 మంది హౌస్‌లోకి ప్రవేశించగా, వారిలో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్‌ ఉన్నారు.

గత వారం నామినేషన్‌ ప్రక్రియలో సంజన, తనూజ సేవ్ కాగా, మిగతా ఏడుగురు నామినేషన్‌లో ఉండటంతో ఎలిమినేట్ అయ్యేది ఎవరో అన్న ఉత్కంఠ కొనసాగింది. చివరికి శ్రష్టి వర్మ హౌస్‌ నుంచి బయటకు వెళ్లడంతో ఉత్కంఠకు తెరపడింది. బిగ్‌బాస్ అభిమానులకు ఇది స్వల్ప ఆశ్చర్యం కలిగించింది. 
Srishti Varma
Bigg Boss Telugu
Bigg Boss 9
Nagarjuna Akkineni
Telugu reality show
elimination
Ram Rathod
Ritu Choudary
Asha Shaini
Telugu TV

More Telugu News