చిరుద్యోగులకూ నో వర్క్ నోపే.. కానీ ఎమ్మెల్యేలకు ఎందుకు వర్తించొద్దు?: అయ్యన్న పాత్రుడు
- అసెంబ్లీకి రాకున్నా కొంతమంది జీతం తీసుకుంటున్నారన్న ఏపీ స్పీకర్
- ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేది కేవలం 45 రోజులే..
- ఆ కొద్దిరోజులూ హాజరుకాకుంటే ఎలాగని ప్రశ్నించిన అయ్యన్న
ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ.. ‘ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేది కేవలం 45 రోజులు మాత్రమే.. ఆ కొద్ది రోజులు కూడా అసెంబ్లీకి రాకపోతే ఎలా? ఉద్యోగులు విధులకు హాజరు కాకుంటే జీతంలో కోత పెడతారు. చిరుద్యోగులకు సైతం ‘నో వర్క్ - నో పే’ విధానం అమలుచేస్తున్నారు. కానీ, కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి హాజరు కాకున్నా పూర్తి జీతం తీసుకుంటున్నారు. ఈ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై లోక్సభ స్పీకర్ మార్గదర్శకాలు ఇవ్వాలి’’ అని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు.