ప్రిపరేషన్ సమయంలో ప్రెగ్నెన్సీ.. చంటిబిడ్డతో ఇంటర్వ్యూకు.. డీఎస్పీగా ఎంపికైన మహిళ
––
లక్ష్యం సాధించాలనే తపన ఉండాలే కానీ ఏదీ అడ్డుకాదని మధ్యప్రదేశ్ కు చెందిన వర్షా పటేల్ నిరూపించి చూపించారు. సాధారణంగా చాలామంది మహిళలు గర్భం దాల్చినపుడు నీరసం కారణంగా బెడ్ కే పరిమితమవుతారు. కానీ వర్షా పటేల్ మాత్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీపీఎస్సీ) పరీక్షలకు సిద్ధమయ్యారు. గర్భిణీగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే చదివారు. ఫలితాల్లో టాపర్ గా నిలిచారు. ఇక ఇంటర్వ్యూకు పిలుపు వచ్చిన సమయంలో వర్షా పటేల్ చేతిలో 26 రోజుల పసికందు ఉంది. ఆ చిన్నారిని భర్త చేతికి ఇచ్చి ఇంటర్వ్యూకు హాజరైన వర్షా.. ప్రస్తుతం డీఎస్పీగా ఎన్నికయ్యారు.
మైహర్ జిల్లాకు చెందిన వర్షా పటేల్ తన విజయం వెనక ఐదు ప్రయత్నాలు ఉన్నాయని చెప్పారు. భర్త సంజయ్ పటేల్ ఉద్యోగం వదులుకుని మరీ తనకు అండగా నిలిచారని, తాను ఐదుసార్లు ఎంపీపీఎస్సీ పరీక్షలు రాశానని చెప్పారు. అందులో మూడుసార్లు ఇంటర్వ్యూ వరకూ వెళ్లినా విఫలమయ్యానని వర్షా వివరించారు. ఇప్పుడు ఐదోసారి తాను అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నానని చెప్పారు. ‘కష్టపడి పనిచేస్తే ఓటమనేదే ఉండదు. విజయాన్ని అందుకునే వరకూ నిరంతరం ప్రయత్నించాలంతే’ అంటూ యువతకు సందేశమిచ్చారు.