భారత్-పాక్ మ్యాచ్ పై ఆసక్తి తగ్గిందంటూ ప్రచారం... అక్తర్ ఏమన్నాడంటే!

  • ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా తలపడనున్న భారత్, పాకిస్థాన్
  • భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయన్న పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్
  • టిక్కెట్లు అమ్ముడవలేదనే వార్తలను కొట్టిపారేసిన రావల్పిండి ఎక్స్‌ప్రెస్
భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠకు కేరాఫ్ అడ్రస్. అయితే, ఈ మ్యాచ్‌పై ఆసక్తి తగ్గిందంటూ వస్తున్న వార్తలపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. 

యుద్ధ వాతావరణం తర్వాత తొలిసారిగా భారత్, పాక్ జట్లు తలపడుతున్నాయని, దీంతో భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని అన్నాడు. మ్యాచ్‌కు ఒక్క రోజు మాత్రమే సమయం ఉన్నా టిక్కెట్లు అమ్ముడవలేదన్న వార్తలను కొట్టిపారేశాడు. "భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. యుద్ధం తర్వాత మేం తొలిసారి భారత్‌ను ఎదుర్కొంటున్నాం. ఇలాంటి మ్యాచ్‌కు స్టేడియం నిండకుండా ఉంటుందా? టిక్కెట్లు ఇంకా అమ్ముడుపోలేదని కొందరు నాతో అన్నారు. మీరేం మాట్లాడుతున్నారు? అన్నీ అమ్ముడయ్యాయి. బయట జరుగుతున్న ప్రచారం నమ్మవద్దు" అని పీటీవీ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ స్పష్టం చేశాడు.


More Telugu News