ఉగ్రవాదాన్ని పోషించే దేశం: ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్‌కు అవమానం!
- ఖతార్‌లో ఇజ్రాయెల్ చేసిన దాడులపై ఐక్యరాజ్య సమితిలో చర్చ
- పాకిస్థాన్‌లో లాడెన్‌ను అమెరికా చంపిందని గుర్తు చేసిన మానవ హక్కుల న్యాయవాది
- హిల్లెల్ వ్యాఖ్యలను తిరస్కరించిన పాకిస్థాన్ ప్రతినిధి
- పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశమని హిల్లెల్ ఆగ్రహం
పాకిస్థాన్‌కు అంతర్జాతీయ వేదికపై మరోసారి పరాభవం ఎదురైంది. పాకిస్థాన్ ఉగ్రవాదులను పోషించే దేశమని మానవ హక్కుల న్యాయవాది హిల్లెల్ న్యూయర్ ఆరోపించారు. హమాస్ నేతలను లక్ష్యంగా చేసుకుని ఖతార్‌లో ఇజ్రాయెల్ చేసిన దాడులపై ఐక్యరాజ్య సమితిలో చర్చలు జరిగాయి.
ఈ చర్చల్లో భాగంగా మానవ హక్కుల న్యాయవాది, యూఎన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హిల్లెల్ న్యూయర్ మాట్లాడుతూ, ఖతార్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. 2012 నుంచి ఖతార్ హమాస్ రాజకీయ కార్యాలయాన్ని నిర్వహిస్తోందని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ దాడులకు పాల్పడిందనే విషయాన్ని ఖండించినందుకు ఐక్యరాజ్య సమితి అధినేత ఆంటోనియో గుటెరస్‌ను హిల్లెల్ తప్పుబట్టారు.
2011లో పాకిస్థాన్‌లో బిన్ లాడెన్‌ను అమెరికా మట్టుబెట్టినప్పుడు నాటి ఐక్యరాజ్య సమితి అధినేత తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఈ సమయంలో పాకిస్థాన్ ప్రతినిధి హిల్లెల్ ప్రసంగాన్ని అడ్డుకుని అభ్యంతరం తెలిపారు. బిన్ లాడెన్ గురించి సభలో ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. వీటిని తిరస్కరిస్తున్నామని పేర్కొన్నారు.
ఆ తర్వాత హిల్లెల్ మైక్‌ను పునరుద్ధరించి, నాలుగు సెకన్లలో ప్రసంగాన్ని ముగించాలని యూఎన్ హెచ్ఆర్ సీ చైర్మన్ సూచించారు. ఆగ్రహించిన హిల్లెల్, పాకిస్థాన్ కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశమని, ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదులను పోషిస్తోందని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు.