ఆపరేషన్ సిందూర్‌పై 'ఏఐ' వీడియోలతో పాకిస్థాన్ దుష్ప్రచారం

  • సామాజిక మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం
  • భారత్‌కు నష్టం జరిగినట్లుగా ఏఐ వీడియోలు
  • ఆర్మీ చీఫ్‌లు, సైనికాధికారులు మాట్లాడినట్లుగా నకిలీ ఏఐ వీడియోలు
'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాకిస్థాన్ పెద్ద ఎత్తున దుష్ప్రచారం ప్రారంభించి, నేటికీ దానిని కొనసాగిస్తూనే ఉంది. భారత్‌పై విషం చిమ్మడానికి పాకిస్థాన్ తన అనుకూల సామాజిక మాధ్యమాలు, ఛానళ్లను ఉపయోగించుకుంటోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా సృష్టించిన నకిలీ వీడియోలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది.

భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌కు నష్టం వాటిల్లినట్లుగా భారత ఆర్మీ చీఫ్‌లు, సైనికాధికారులు మాట్లాడినట్లుగా నకిలీ ఏఐ వీడియోలను సృష్టించి ప్రచారం చేస్తోంది.

భారత్‌పై పాకిస్థాన్ చేస్తున్న ఈ దుష్ప్రచారంపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఈ నకిలీ వీడియోలు సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని, కాబట్టి ఎవరూ వీటిని షేర్ చేయవద్దని సూచించింది. అనుమానాస్పద కంటెంట్‌ను గుర్తిస్తే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం వాట్సాప్ నెంబర్ 8799711259కు లేదా మెయిల్ ద్వారా తెలియజేయాలని కోరింది.


More Telugu News