భారత సైనికులను కరిగించే ఆయుధాన్ని చైనా ఉపయోగించింది: అమెరికా సెనేటర్ సంచలన ఆరోపణ

  • భారత సైనికులపై చైనా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఆయుధ ప్రయోగం
  • సంచలన వ్యాఖ్యలు చేసిన అమెరికా సెనేటర్ బిల్ హ్యాగెర్టీ
  • ఐదేళ్ల క్రితం సరిహద్దు వివాదం సమయంలో ఈ ఘటన
  • మోదీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత తెరపైకి వచ్చిన ఆరోపణలు
భారత్-చైనా సరిహద్దులో ఐదేళ్ల క్రితం చోటుచేసుకున్న ఘర్షణలో చైనా అత్యంత ప్రమాదకరమైన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఆయుధాన్ని ప్రయోగించిందని అమెరికాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ బిల్ హ్యాగెర్టీ సంచలన ఆరోపణలు చేశారు. భారత సైనికులను కరిగించేందుకు విద్యుదయస్కాంత ఆయుధాలను చైనా వినియోగించిందని ఆయన పేర్కొనడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

టెన్నెస్సీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హ్యాగెర్టీ, ఈ ఘటన 2020లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణలకు సంబంధించి ఉండవచ్చని పరోక్షంగా సూచించారు. అయితే, ఆయన గల్వాన్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. "చైనా, భారత్‌ల మధ్య చాలాకాలంగా వివాదాలు, అపనమ్మకాలు ఉన్నాయి. సరిగ్గా ఐదేళ్ల క్రితం సరిహద్దు వివాదంలో భాగంగా చైనా... భారత సైనికులను కరిగించేందుకు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఆయుధాన్ని ఉపయోగించింది" అని ఆయన పేర్కొన్నారు.

ఈ నెలలో టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశమైన రెండు వారాలకే హ్యాగెర్టీ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. 


More Telugu News