లిక్కర్ కేసు.. నారాయణస్వామికి బిగుస్తున్న ఉచ్చు.. కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలపై సిట్ ఫోకస్
- లిక్కర్ స్కాం దర్యాప్తు ముమ్మరం
- ఫోరెన్సిక్ ల్యాబ్‌కు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫోన్
- ఫోరెన్సిక్ నివేదికతో కీలక ఆధారాలు లభిస్తాయని అధికారుల అంచనా
ఏపీ లిక్కర్ స్కాం దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ సీనియర్ నేత నారాయణస్వామి మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపేందుకు ఏసీబీ కోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అనుమతి మంజూరు చేసింది. ఈ పరిణామంతో ఈ కేసు విచారణ మరింత వేగవంతమైంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి పాత్రపై సిట్ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే ఒకసారి ఆయన్ను విచారించిన అధికారులు, ఆయన ఫోన్‌లో స్కామ్‌కు సంబంధించిన కీలక సమాచారం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫోన్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (ఎఫ్‌ఎస్‌ఎల్) పంపి, పూర్తిస్థాయి డేటాను విశ్లేషించాలని నిర్ణయించారు. దీనికి న్యాయస్థానం నుంచి కూడా అనుమతి లభించడంతో దర్యాప్తులో ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
మరోవైపు, సిట్ అధికారులు కేవలం ఫోన్ డేటాతోనే సరిపెట్టకుండా నారాయణస్వామి కాల్ డేటా రికార్డులు, ఆయన బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలపై కూడా లోతుగా ఆరా తీస్తున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నుంచి రాబోయే నివేదిక ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలకం కానుందని, అందులో లభించే ఆధారాలను బట్టి తదుపరి చర్యలు ఉంటాయని తెలుస్తోంది. ఈ నివేదిక కోసం సిట్ అధికారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.