ఫారెస్టులో పరుగులు పెట్టించే 'మీషా' .. ఓటీటీలో!

  • మలయాళ సినిమాగా 'మీషా'
  • సర్వైవల్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ  
  • ఫారెస్టులో పరిగెత్తే కథనం 
  • ఉత్కంఠ భరితులను చేసే కంటెంట్

మలయాళం నుంచి ఇప్పుడు ఓ సర్వైవల్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే 'మీషా'. జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జులై 31వ తేదీన థియేటర్లకు వచ్చింది. థియేటర్ల నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'ఆహా తమిళ్' ద్వారా ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ నెల 12వ తేదీ స్ట్రీమింగ్ కానుంది. 

కథిర్ మలయాళంలో చేసిన ఫస్టు మూవీ ఇది. తమిళంలోనూ ఈ సినిమా విడుదలైంది. నటుడిగా కథిర్ కి మరిన్ని మార్కులు తెచ్చిపెట్టిన సినిమా ఇది. మరో ముఖ్యమైన పాత్రలో షైన్ టామ్ చాకో కనిపించనున్నాడు. కథాకథనాల పరంగా .. నేపథ్య సంగీతం పరంగా ఈ సినిమా అక్కడ మంచి రివ్యూలను రాబట్టింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఆహా తమిళంలో విడుదల కానుంది. త్వరలో తెలుగు ఓటీటీకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

 కథ విషయానికి వస్తే, ఫారెస్టు గార్డుగా పనిచేస్తున్న ఒక వ్యక్తి, రీ యూనియన్ పేరుతో తన ఆరుగురు స్నేహతులను డిన్నర్ కి ఆహ్వానిస్తాడు. ఆరుగురు స్నేహితులు కలిసి ఫారెస్టులో డిన్నర్ కి వెళతారు. తాము చాలా ప్రమాదకరమైన ప్రదేశంలోకి అడుగుపెట్టామనే విషయం వాళ్లకి అక్కడికి వెళ్లిన తరువాతనే అర్థమవుతుంది. అక్కడి నుంచి వాళ్లు ప్రాణాలతో బయటపడతారా  లేదా? అనేదే కథ. 



More Telugu News