Deepika Padukone: కూతురి కోసం కేక్ చేసిన దీపిక... ఆడంబరాలకు దూరంగా బర్త్‌డే వేడుక!

Deepika Padukone Made Daughter Duas Birthday Cake
  • కుమార్తె 'దువా' మొదటి పుట్టినరోజు వేడుకలు
  • స్వయంగా చాక్లెట్ కేక్ తయారు చేసిన తల్లి దీపిక
  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోతో ఎమోషనల్ పోస్ట్ షేర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తన కుమార్తె 'దువా' మొదటి పుట్టినరోజును ఎంతో ప్రత్యేకంగా, నిరాడంబరంగా జరిపారు. సాధారణంగా సెలబ్రిటీలు తమ పిల్లల పుట్టినరోజులను గ్రాండ్‌ పార్టీలతో అట్టహాసంగా జరుపుకుంటారు. కానీ, దీపిక మాత్రం అందుకు భిన్నంగా తన ప్రేమను చాటుకున్నారు. తన గారాలపట్టి కోసం స్వయంగా కేక్ తయారు చేసి అందరి మనసులు గెలుచుకున్నారు.

బాలీవుడ్ స్టార్ జంట రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణెలకు గతేడాది సెప్టెంబర్ 8న కుమార్తె జన్మించిన సంగతి తెలిసిందే. తమ ప్రార్థనలకు దక్కిన సమాధానంలా భావించి పాపకు 'దువా' అని పేరు పెట్టారు. తాజాగా సెప్టెంబర్ 9న దువా మొదటి పుట్టినరోజు సందర్భంగా దీపిక స్వయంగా ఒక చాక్లెట్ కేక్ తయారు చేశారు. ఆ కేక్ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ... "నా ప్రేమ భాష ఏంటో తెలుసా? నా కుమార్తె మొదటి పుట్టినరోజు కోసం కేక్ చేయడమే" అని ఎంతో ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.

ఈ పోస్ట్ పెట్టిన కేవలం రెండు గంటల్లోనే 5 లక్షలకు పైగా లైకులు సాధించి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌పై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. నటీమణులు బిపాషా బసు, కాజల్ అగర్వాల్, భూమి పడ్నేకర్ వంటి వారు దువాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు సైతం "స్వీట్ తల్లి నుంచి స్వీట్ బేబీకి స్వీట్ కేక్", "మీరే స్వయంగా కేక్ చేశారా, గ్రేట్!", "మీరు బెస్ట్ మమ్మీ" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆడంబరాలకు పోకుండా, ఎంతో సింపుల్‌గా తన ప్రేమను చాటుకున్న దీపిక తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Deepika Padukone
Dua
Ranveer Singh
Deepika Padukone daughter
Bollywood
Birthday cake
Celebrity birthday
Dua birthday
Social media
actress

More Telugu News