రెండేళ్ల క్రితం ఇదే రోజున మా నాన్నను అన్యాయంగా అరెస్ట్ చేశారు: నారా లోకేశ్

  • తండ్రి చంద్రబాబు అరెస్టును గుర్తుచేసుకున్న నారా లోకేశ్
  • చంద్రబాబు అరెస్టు జరిగి నేటికి రెండేళ్లు పూర్తి
  • ప్రజాస్వామ్యానికే అది ఒక చీకటి అధ్యాయం అని వ్యాఖ్య
  • ఆనాటి బాధ ఇప్పటికీ ఉందన్న లోకేశ్
  • న్యాయం, నిజం కోసం పోరాటం కొనసాగిస్తాం అని స్పష్టీకరణ
  • ప్రజలపై నాన్న నమ్మకమే మాకు స్ఫూర్తి అని వెల్లడి
తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు జరిగి నేటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. 

"రెండేళ్ల క్రితం.. ఇదే రోజున... మా నాన్న చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటూ ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ ఘటన మా కుటుంబంలోనే కాదు, ప్రజాస్వామ్యంలోనే ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. ఆ బాధ ఇప్పటికీ మిగిలే ఉంది... అయినప్పటికీ మా సంకల్పం మరింత బలపడింది. ఆయన ధైర్యం, హుందాతనం, ఆంధ్రప్రదేశ్ ప్రజలపై అచంచలమైన నమ్మకం... న్యాయం, సత్యం కోసం మా పోరాటానికి స్ఫూర్తినిస్తోంది" అంటూ లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు.


More Telugu News