జట్టులో చోటు దక్కకపోవడంపై శ్రేయస్ అయ్యర్ రియాక్షన్

  • ఏడాదికి పైగా టెస్టు జట్టులో, రెండేళ్లుగా టీ20 జట్టులో శ్రేయస్ కు నో ప్లేస్
  • అర్హత ఉన్నా అవకాశం దక్కకపోతే అసహనం తప్పదన్న క్రికెటర్
  • అవకాశం లభించిన ప్రతి చోటా ఉత్తమ ప్రదర్శన చేసుకుంటూ వెళ్లాలని వ్యాఖ్య
భారత జట్టులో చోటు దక్కకపోవడంపై ప్రముఖ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తాజాగా స్పందించారు. ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో శ్రేయస్ మాట్లాడుతూ.. అర్హత ఉన్నా సరే తుది జట్టులో చోటు దక్కకపోతే ఏ ఆటగాడికైనా అసహనం కలుగుతుందని అన్నారు.

 తుది జట్టులో చోటు దక్కకలేదని ఆలోచిస్తూ నిరాశ చెందడం కన్నా అవకాశం లభించిన ప్రతి చోటా ఉత్తమ ప్రదర్శన చేస్తూ పోవాలని చెప్పారు. నిలకడగా రాణిస్తూ జట్టును గెలిపించే ప్రయత్నం చేయాలన్నారు. మన పనిని నైతికతతో చేస్తూ వెళ్లాలని, మనపై ఎవరి దృష్టీ లేకపోయినా నిబద్ధతతో పనిచేయాలని చెప్పారు. 

ఆడిన ప్రతీ మ్యాచ్ లోనూ ఉత్తమ ప్రదర్శన చేస్తూ వన్డేల్లో కీలక ఆటగాడిగా ఎదిగిన శ్రేయస్ ను సెలెక్టర్లు దూరం పెడుతున్నారు. ఏడాదిగా శ్రేయస్ ను టెస్టు జట్టుకు ఎంపిక చేయలేదు. ఇటీవలి ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌ కూ జట్టులోకి తీసుకోలేదు. రెండేళ్లుగా టీ20 జట్టులోనూ శ్రేయస్ ను ఆడించలేదు. తాజాగా ఆసియా కప్‌ టీ20 టోర్నీకి కూడా శ్రేయస్ ను ఎంపిక చేయలేదు.


More Telugu News