ఆసియా కప్ హాకీ విజేత భారత్
- బిహార్ లోని రాజ్‌గిర్ వేదికగా ఆసియా హాకీ కప్ ఫైనల్ టోర్నీ
- దక్షిణ కొరియాపై 4-1 తేడాగా విజయం సాధించిన భారత హాకీ జట్టు
- హాకీ ప్రపంచ కప్ టోర్నీకి అర్హత సాధించిన భారత జట్టు
- వచ్చే ఏడాది ఆగస్టు 14 నుంచి 30వరకు బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా హాకీ ప్రపంచ కప్ టోర్నీ
ఆసియా హాకీ కప్ 2025లో భారత హాకీ జట్టు అద్వితీయ విజయం సాధించింది. బీహార్‌లోని రాజ్‌గిర్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 4-1 తేడాతో గెలుపొందింది. ఈ ఘన విజయంతో భారత్ నాలుగోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. అంతేగాక, వచ్చే ఏడాది జరిగే హాకీ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.
ఇంతకు ముందు భారత్ 2003, 2007, 2017లో ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఇప్పుడు 8 ఏళ్ల అనంతరం మరోసారి కప్‌ను సొంతం చేసుకుంది.
మ్యాచ్ హైలైట్స్:
1వ నిమిషం: సుఖ్‌జీత్ సింగ్ వేగంగా ముందుకు దూసుకెళ్లి తొలి గోల్‌ను నమోదు చేశాడు.
28వ నిమిషం: దిల్‌ప్రీత్ సింగ్ బలమైన దాడితో రెండవ గోల్ సాధించాడు.
45వ నిమిషం: అదే దిల్‌ప్రీత్ తన రెండవ వ్యక్తిగత గోల్‌తో భారత్ ఆధిక్యాన్ని పెంచాడు.
50వ నిమిషం: అమిత్ రోహిదాస్ బలమైన ఫినిషింగ్‌తో నాలుగో గోల్ కొట్టి విజయం ఖరారు చేశాడు.
తదుపరి లక్ష్యం - ప్రపంచకప్:
ఈ విజయంతో భారత హాకీ జట్టు 2026లో ఆగస్టు 14 నుంచి 30 వరకూ బెల్జియం మరియు నెదర్లాండ్స్ వేదికగా జరగబోయే హాకీ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించింది. ప్రపంచ స్థాయిలోనూ ఇదే పటిమ చూపాలని భారత్ ఆశిస్తోంది.