500 తిరస్కరణలు... నెలకు రూ.20 లక్షల జీతం... ఓ టెక్కీ అసాధారణ విజయం!
- ఒక్క ఇంటర్వ్యూతో ఓపెన్‌ఏఐ ప్రాజెక్టులో అవకాశం
- చిన్న పట్టణం నుంచే గ్లోబల్ అవకాశాలు అందుకున్న టెక్కీ
- ప్రస్తుతం సొంతంగా టెక్ సంస్థ ఏర్పాటుకు శ్రీకారం
- పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపణ
పట్టుదల ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని నిరూపించాడు ఈశాన్య భారతదేశానికి చెందిన 23 ఏళ్ల యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 500కు పైగా ఉద్యోగ తిరస్కరణలను ఎదుర్కొని, చివరికి నెలకు రూ. 20 లక్షల జీతంతో ఓ భారీ ప్రాజెక్టును దక్కించుకున్నాడు. ఓ చిన్న పట్టణం నుంచి వచ్చిన ఈ యువకుడి విజయగాథ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తినిస్తోంది.
తన కుటుంబంలోనే మొదటిసారిగా కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తిచేసిన ఈ యువకుడికి క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో భాగంగా మొదట వార్షికంగా రూ. 3.6 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. అయితే, ఉద్యోగంలో చేరడానికి 8 నెలలు ఆగాల్సి రావడంతో ఆ సమయాన్ని వృథా చేయకుండా అంతర్జాతీయ రిమోట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ క్రమంలో దాదాపు 500 నుంచి 600 కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాడు.
ఈ ప్రయత్నాల గురించి అతను రెడిట్‌లో పంచుకుంటూ "నెలల తరబడి తిరస్కరణలే ఎదురయ్యాయి. అన్ని దరఖాస్తులకుగానూ ఒక్క ఇంటర్వ్యూ కాల్ మాత్రమే వచ్చింది. అదృష్టవశాత్తూ దాంట్లోనే విజయం సాధించాను" అని గుర్తుచేసుకున్నాడు. ఆ ఒక్క అవకాశమే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఓపెన్‌ఏఐకి సంబంధించిన ప్రాజెక్టులో నెలకు రూ. 20 లక్షల జీతంతో పనిచేసే అద్భుత అవకాశం అతడిని వరించింది. ఈ ప్రాజెక్టు కోసం రేయింబవళ్లు కష్టపడ్డానని, రోజుకు కేవలం 4 నుంచి 5 గంటలు మాత్రమే నిద్రపోయానని తెలిపాడు. "నైపుణ్యం, ఇంటర్నెట్ ఉంటే ప్రాంతంతో సంబంధం లేదని రిమోట్ వర్క్ నిరూపించింది" అని పేర్కొన్నాడు.
గత ఆగస్టు నెలతో ఆ ప్రాజెక్టు పూర్తయినప్పటికీ, అతడు తన ప్రయాణాన్ని ఆపలేదు. కేవలం 23 ఏళ్ల వయసులోనే ఇప్పుడు సొంతంగా ఒక టెక్నాలజీ సంస్థను ప్రారంభించే పనిలో నిమగ్నమయ్యాడు. తనలాంటి చిన్న పట్టణాల నుంచి వచ్చే విద్యార్థులకు అతడు ఒక సలహా ఇస్తున్నాడు. "వచ్చినదానితో సర్దుకుపోవద్దు. అన్నిచోట్లా ప్రయత్నించండి. మీ పనిని నలుగురికీ తెలిసేలా చేయండి. నెట్‌వర్కింగ్‌ను వదలకుండా కొనసాగించండి" అని సూచించాడు. ఈ యువకుడి కథ టైర్-3 నగరాల్లోని విద్యార్థులు కూడా పట్టుదల, నైపుణ్యంతో ప్రపంచస్థాయి అవకాశాలను అందుకోగలరనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.