Ganesh Nimajjanam: హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం... స్టంట్లు చేయవద్దని పోలీసులు హెచ్చరికల జారీ

Ganesh Nimajjanam Police Issue Key Warnings Against Stunts
షార్ట్స్‌లో చూడండి
భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో శనివారం కన్నుల పండువగా జరిగే ఈ నిమజ్జన వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. గణపతి నిమజ్జనాన్ని శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించుకునేలా సహకరించాలని కోరారు. భక్తులకు, ప్రజలకు పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు.

- నిర్దేశించిన మార్గాల్లోనే గణపతి విగ్రహాలు తీసుకువెళ్లాలి.
- ఘర్షణలకు తావులేకుండా శోభాయాత్రలో పాల్గొనాలి.
- కత్తులు, ఇతర మారణాయుధాలతో విన్యాసాలు చేయడం నిషేధం.
- వాహనాలతో స్టంట్లు చేస్తే చర్యలు ఉంటాయి.
- రోడ్లపై వెళుతున్న వారిపై రంగులు చల్లొద్దు. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించవద్దు.
- నిమజ్జన ఊరేగింపు వాహనాల్లో కత్తులు, మారణాయుధాలు, మందుగుండు సామగ్రిని తీసుకువెళ్లడం నిషేధం.
- విద్యుత్ వైర్లను స్వయంగా తొలగించే ప్రయత్నం ప్రమాదకరం.
- ఆసుపత్రులు, ఇతర నిషేధిత ప్రాంతాల్లో భారీ శబ్దాలతో ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు ఉంటాయి.
- ఎవరైనా అసభ్యంగా, అమర్యాదగా ప్రవర్తిస్తే 'డయల్ 100'కు కాల్ చేయాలి.
- నిష్ఠతో శోభాయాత్ర చేసి గణేశుడి ఆశీస్సులు పొందండి అని పేర్కొన్నారు.
Go Back to Shorts
Ganesh Nimajjanam
Hyderabad
Ganesh Immersion
Police Advisory
Vinayaka Chavithi
Shobha Yatra

More Telugu News