మరో 'ఫైట్' కు సిద్ధమైన మైక్ టైసన్... ఈసారి అజేయుడితో పోరు!
- బాక్సింగ్ రింగ్‌లో దిగ్గజాల అరుదైన పోరు
- 2026లో టైసన్, మేవెదర్ మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్
- పోరును అధికారికంగా ప్రకటించిన CSI స్పోర్ట్స్
- ఇంకా ఖరారు కాని తేదీ, వేదిక వివరాలు
- ఈ ఫైట్ జరుగుతుందని ఊహించలేదన్న టైసన్
బాక్సింగ్ అభిమానులు కలలో కూడా ఊహించని ఒక అరుదైన పోరుకు రంగం సిద్ధమైంది. చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఇద్దరు దిగ్గజ బాక్సర్లు.. ‘ఐరన్ మైక్’ మైక్ టైసన్, ‘మనీ’ ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్ రింగ్‌లో తలపడనున్నారు. మేవెదర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 2026లో వీరిద్దరి మధ్య ఒక భారీ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనున్నట్లు సీఎస్ఐ స్పోర్ట్స్/ఫైట్ స్పోర్ట్స్ అధికారికంగా ధృవీకరించింది. ఈ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా బాక్సింగ్ అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగింది.
ఈ మెగా ఫైట్‌కు సంబంధించిన కచ్చితమైన తేదీ, వేదిక వివరాలను ఇంకా ఖరారు చేయలేదని, త్వరలోనే వాటిని ప్రకటిస్తామని సీఎస్ఐ స్పోర్ట్స్ తెలిపింది. ఈ పోరు ద్వారా అందే ప్రైజ్ మనీ వివరాలను కూడా ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ ఇద్దరు బాక్సర్ల గత రికార్డులను పరిశీలిస్తే పే-పర్-వ్యూ, టికెట్ల అమ్మకాల ద్వారా భారీ స్థాయిలో ఆదాయం సమకూరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ అనూహ్యమైన ఫైట్‌పై మైక్ టైసన్ స్వయంగా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. "ఫ్లాయిడ్ మేవెదర్‌తో నేను రింగ్‌లోకి వెళ్లాలని సీఎస్ఐ చెప్పినప్పుడు, 'ఇది అసాధ్యం, జరగదులే' అనుకున్నాను. కానీ ఫ్లాయిడ్ ఈ పోరుకు అంగీకరించాడు. ఇది ప్రపంచం ఊహించని, కనీసం నేను కూడా ఊహించని ఒక సంఘటన. బాక్సింగ్ ఒక కొత్త శకంలోకి ప్రవేశించింది" అని టైసన్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నాడు.
ప్రస్తుతం 59 ఏళ్ల వయసున్న మైక్ టైసన్, హెవీవెయిట్ విభాగంలో తన పవర్‌ఫుల్ పంచ్‌లతో ప్రత్యర్థులను వణికించిన చరిత్ర ఉంది. ఆయన కెరీర్‌లో 50 విజయాలు (44 నాకౌట్లు) సాధించారు. మరోవైపు, 48 ఏళ్ల ఫ్లాయిడ్ మేవెదర్ తన అద్భుతమైన డిఫెన్స్‌తో అజేయంగా నిలిచాడు. తన కెరీర్‌లో ఒక్క ఓటమి కూడా లేకుండా, ఆడిన 50 బౌట్లలోనూ విజయం సాధించి చరిత్ర సృష్టించాడు. దూకుడుకు మారుపేరైన టైసన్, అద్భుతమైన రక్షణ నైపుణ్యాలున్న మేవెదర్ మధ్య పోరు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది.