ఏపీ సీనియర్ ఐఏఎస్ అధికారి వివాహేతర బంధం.. అనుమానంతో మహిళను కొట్టడంతో మృతి?
- హైదరాబాద్ మహిళతో ఏపీ ఐఏఎస్ వివాహేతర బంధం
- ప్రియురాలిపై అనుమానంతో మొదలైన గొడవ
- ఘర్షణలో మహిళను కొట్టడంతో తలకు తీవ్ర గాయం
- ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందిన మహిళ
- పలుకుబడి ఉపయోగించి పోలీసు కేసు లేకుండా జాగ్రత్త
- విజయవాడలో విధులకు హాజరవుతున్న సదరు అధికారి
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌లో తనతో వివాహేతర సంబంధం నెరుపుతున్న ఓ మహిళ మృతికి ఆయనే కారణమయ్యారని, తన పలుకుబడిని ఉపయోగించి ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా తొక్కిపెట్టారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం ప్రకారం... ఏపీ కేడర్‌కు చెందిన సదరు అధికారి గతంలో ఓ ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ, వైఎస్ జగన్ హయాంలో ఓ కీలక శాఖకు అధిపతిగానూ పనిచేశారు. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు సమాచారం. తరచూ హైదరాబాద్‌లోనే గడుపుతూ, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారని తెలుస్తోంది.
ఇటీవల అనారోగ్యానికి గురైన ఆ అధికారి, తాను చికిత్స పొందుతున్న సమయంలో ఆ మహిళ వేరొకరితో సన్నిహితంగా ఉంటోందని అనుమానించారు. ఈ అనుమానమే వారి మధ్య గొడవకు కారణమైంది. గత శుక్రవారం వీరిద్దరి మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆవేశాన్ని అదుపు చేసుకోలేకపోయిన అధికారి ఆమెను బలంగా కొట్టగా, ఆమె తల గోడకు తగిలి తీవ్ర గాయమైందని సమాచారం.
వెంటనే ఆమెను సమీపంలోని ఓ పెద్ద ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది. అయితే, ఈ మరణానికి అసలు కారణాన్ని దాచిపెట్టి, ‘ప్రమాదవశాత్తు కింద పడిపోవడం వల్ల గాయమైంది’ అని ఆసుపత్రి రికార్డుల్లో నమోదు చేయించారని తెలుస్తోంది. తనకున్న అధికార పలుకుబడిని అడ్డం పెట్టుకుని, ఈ విషయం పోలీసుల వరకు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారని సమాచారం.
ఈ దారుణం జరిగిన తర్వాత ఏమీ ఎరగనట్టు విజయవాడకు తిరిగి వచ్చి తన విధుల్లో నిమగ్నమయ్యారు. అయితే, హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన గురించి ఆయన సన్నిహితులకు, కొందరు ఐఏఎస్ వర్గాలకు ఇప్పటికే తెలిసిపోయినట్టు ప్రచారం జరుగుతోంది.