సినిమాలో దమ్ముండాలి .. చెప్పుతో కొట్టుకోవడం కరెక్ట్ కాదు: తమ్మారెడ్డి
- అందరూ ప్రాణం పెట్టే సినిమా తీస్తారు
- ఏ సినిమా చూడాలనేది ఆడియన్స్ ఇష్టం
- స్టేజ్ పై ఛాలెంజ్ లు చేయకపోవడమే మంచిది
- పెద్ద సినిమాలకే జనాలు రావడం లేదు
- కంగారుపడకూడదన్న తమ్మారెడ్డి
సీనియర్ దర్శక నిర్మాతగా తమ్మారెడ్డి భరద్వాజ్ కి మంచి పేరు ఉంది. ఎప్పటికప్పుడు ఆయన ఇండస్ట్రీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందిస్తూ ఉంటారు. అలాగే 'త్రిబాణధారి బార్బరిక్' సినిమా దర్శకుడు మోహన్ శ్రీవత్స చెప్పుతో కొట్టుకోవడం గురించి, తాజాగా ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. "ప్రతి దర్శకుడు కూడా తన సినిమాను ప్రాణం పెట్టే చేస్తాడు. అయితే ఆ సినిమాను చూడాలా వద్దా అనేది ప్రేక్షకుల ఇష్టమే" అని అన్నారు.
" ఈ రోజుల్లో స్టేజ్ లపై చాలామంది చాలా మాట్లాడుతున్నారు. నేను చింపేశాను .. పొడిచేశాను .. ఈ సినిమా ఇండస్ట్రీ అంతుచూస్తుంది అంటున్నారు. ప్రేక్షకుల ముందే ఛాలెంజ్ లు చేస్తున్నారు. నేను అంత కష్టపడ్డాను .. ఇంతకష్టపడ్డాను .. మీరు వచ్చి సినిమా చూడాల్సిందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎవరి కోసం వారు పడుతున్న కష్టాన్ని ప్రేక్షకులు ఎందుకు చూడాలి. ఆడియన్స్ కి చిన్న సినిమా .. పెద్ద సినిమా అనేమీ లేదు .. నచ్చితే చూస్తారు. అందుకు ఉదాహరణగా హిట్టయిన చిన్న సినిమాలు కనిపిస్తూనే ఉన్నాయి కదా" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ రోజుల్లో కొంతమంది హీరోలకు మాత్రమే టికెట్లు తెగుతున్నాయి. హీరోయిన్స్ లో సాయిపల్లవి వంటి ఒకరిద్దరి సినిమాలకు మాత్రమే కాస్త క్రేజ్ ఉంది. మిగతా హీరోల సినిమాలకు జనాలు థియేటర్లకు రావడం లేదు. దిల్ రాజు .. సితార బ్యానర్ల నుంచి వచ్చిన పెద్ద సినిమాలు, స్టార్ హీరోలు చేసిన సినిమాలే ఫ్లాప్ అవుతున్నాయి. మరి వాటిని ఏమనుకోవాలి. సక్సెస్ లు .. ఫెయిల్యూర్ లు ఇక్కడ సహజం. కంగారు పడకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లడమే. సినిమాలో దమ్ముంటే ప్రేక్షకులు తప్పకుండా చూస్తారు" అని అన్నారు.