రాయదుర్గంలో రూ. 51 లక్షలు పలికిన గణేశుడి లడ్డూ
- మైహోమ్ భుజాలో వేలంలో రికార్డు ధర పలికిన లడ్డూ ప్రసాదం
- రూ. 51,77,777కు దక్కించుకున్న ఇల్లందుకు చెందిన గణేశ్
- గత ఏడాది రూ. 29 లక్షలకు లడ్డూను దక్కించుకున్న గణేశ్
రాయదుర్గంలోని మైహోమ్ భుజాలో గణేశు లడ్డూను ఇల్లందుకు చెందిన గణేశ్ అనే వ్యక్తి రూ. 51,77,777కు దక్కించుకున్నారు. గత ఏడాది ఇక్కడ లడ్డూ ధర రూ. 29 లక్షలు పలికింది. అప్పుడు కూడా ఈ లడ్డూను వేలంలో ఆయనే సొంతం చేసుకున్నారు.