Samantha: రాజ్ తో మరోసారి కనిపించిన సమంత.. దుబాయ్ లో చేతిలో చేయి వేసి..!

Samantha and Raj Nidimoru Spark Relationship Rumors in Dubai
  • డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్‌షిప్ రూమర్లు
  • దుబాయ్ ఫ్యాషన్ వీక్‌లో రాజ్‌తో కలిసి ప్రత్యక్షం
  • ఆయన చేతిలో చేయి వేసి ఉన్న ఫొటో షేర్ చేసిన సామ్
  • తమ బంధంపై పరోక్షంగా హింట్ ఇచ్చిందంటూ చర్చ
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సమంత పోస్ట్
స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలపై మరోసారి ఆసక్తి రేపారు. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా, తాజాగా ఆమె చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఈ వదంతులకు మరింత బలాన్నిచ్చింది.

వివరాల్లోకి వెళితే, సమంత ఇటీవల దుబాయ్ ఫ్యాషన్ వీక్ ఈవెంట్‌కు రాజ్ నిడిమోరుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేతిలో చేయి వేసి నడుస్తున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫొటోలో రాజ్ ముఖం స్పష్టంగా కనిపించనప్పటికీ, అది ఆయనేనని నెటిజన్లు, అభిమానులు భావిస్తున్నారు. ఎయిర్‌పోర్టులో ఇద్దరూ కలిసి షాపింగ్ చేస్తూ కూడా కనిపించారని సమాచారం. ఈ కొత్త పోస్ట్‌తో వీరి బంధం గురించిన చర్చ నెట్టింట మళ్లీ మొదలైంది.

గత కొంతకాలంగా సమంత, రాజ్ మధ్య ఏదో నడుస్తోందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్లడంతో పాటు, ఒకే ఇంట్లో ఉంటున్నారనే ప్రచారం కూడా జరిగింది. పలు సందర్భాల్లో సమంత ఆయనతో ఉన్న ఫొటోలను పంచుకోవడం ఈ వార్తలకు మరింత ఊతమిచ్చింది. అయితే, రాజ్‌కు ఇదివరకే వివాహం కావడం ఈ విషయంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ బంధంపై ఆయన భార్య కూడా సోషల్ మీడియాలో పరోక్షంగా కొన్ని పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.

నాగచైతన్యతో విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్ బారిన పడటంతో సినిమాలకు దూరంగా ఉన్న సమంత, ప్రస్తుతం తన ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే రాజ్ నిడిమోరుతో ఆమెకు సాన్నిహిత్యం పెరిగినట్లు తెలుస్తోంది. ఈ రూమర్లపై సమంత ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ, ఆమె తాజా పోస్ట్ ద్వారా తమ బంధం గురించి పరోక్షంగా ఓ హింట్ ఇచ్చిందని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. 
Samantha
Samantha Ruth Prabhu
Raj Nidimoru
Dubai Fashion Week
Relationship rumors
Bollywood director
Divorce
Naga Chaitanya
Myositis
Instagram post

More Telugu News