: సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ వాహనాలపై 18 చలాన్లు!
- ఒకే నంబర్ గల వాహనాలపై ఏకంగా 18 పెండింగ్ ఫైన్లు
- మొత్తం జరిమానా విలువ రూ.17 వేలు దాటిన వైనం
- మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నాయంటూ ఆరోపణలు
సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని వాహనాలపై పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ చలాన్లు పేరుకుపోయిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒకే రిజిస్ట్రేషన్ నంబర్‌పై ఏకంగా 18 పెండింగ్ చలాన్లు ఉండటం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే.. సీఎం కాన్వాయ్‌లో వినియోగిస్తున్న TG09 RR0009 నంబర్ గల వాహనాలపై ఇప్పటివరకు మొత్తం 18 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. ఈ జరిమానాల మొత్తం విలువ రూ.17,795గా ఉంది. ముఖ్యంగా మితిమీరిన వేగం కారణంగానే ఈ చలాన్లు నమోదైనట్లు తెలుస్తోంది.