AP Bar Licenses: ఏపీలో మిగిలిపోయిన 428 బార్లకు రీ నోటిఫికేషన్

AP Re Notification for 428 Bar Licenses
  • నూతన బార్ పాలసీ 2025 - 28 కింద డ్రా ఆఫ్ లాట్స్ విధానంలో లైసెన్సుల మంజూరు
  • ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ దరఖాస్తుల స్వీకరణ
  • ఈ నెల 15వ తేదీ ఉదయం జిల్లా కలెక్టరేట్‌లలో లాటరీ నిర్వహించి లైసెన్సుదారులను ఖరారు చేయనున్న అధికారులు
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 432 బార్ల (428 ఓపెన్, 4 రిజర్వు) లైసెన్సుల జారీకి ఎక్సైజ్ శాఖ మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసింది. నూతన బార్ పాలసీ 2025 – 28 ప్రకారం డ్రా ఆఫ్ లాట్స్ విధానంలో లైసెన్సులు మంజూరు చేయనున్నారు.

గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 924 బార్ల (840 ఓపెన్, 84 రిజర్వు) లైసెన్సు జారీకి నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానించగా, మద్యం వ్యాపారుల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో 492 (412 ఓపెన్, 80 రిజర్వు) బార్లకు మాత్రమే లైసెన్సులు ఖరారు చేశారు. మిగిలిన బార్లకు నాలుగు కంటే తక్కువ దరఖాస్తులు రావడంతో లాటరీ నిర్వహించలేదు.

ఈ నేపథ్యంలో మిగిలిన బార్లను భర్తీ చేసేందుకు ఎక్సైజ్ శాఖ రీ-నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 15వ తేదీ ఉదయం జిల్లా కలెక్టరేట్‌లలో లాటరీ నిర్వహించి లైసెన్సుదారులను ఖరారు చేస్తారు. 
AP Bar Licenses
Andhra Pradesh
Excise Department
Bar Policy 2025-28
Liquor licenses
Lottery system
District Collectorates
Liquor Business

More Telugu News