Detective Ujwalan: తెలుగులో అందుబాటులోకి వస్తున్న మలయాళ థ్రిల్లర్!

Detectiv Ujjwalan Movie Update
షార్ట్స్‌లో చూడండి
మలయాళంలో థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలు ఎక్కువగా తెరకెక్కుతూ ఉంటాయి. అలా  రూపొందిన మలయాళ సినిమాలకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వైపు నుంచి మంచి డిమాండ్ ఉంది. ఈ విషయాన్నీ మరోసారి నిరూపించిన సినిమానే 'డిటెక్టివ్ ఉజ్వలన్'. సోఫియా పాల్ నిర్మించిన ఈ సినిమాకి, ఇంద్రనీల్ గోపాలకృష్ణన్ - రాహుల్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది మే 23వ తేదీన థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు.  

జులై 11 నుంచి ఈ సినిమా 'నెట్ ఫ్లిక్స్'లో మలయాళంలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా మెయిన్ లైన్ ఏమిటనేది తెలుసుకున్న తెలుగు ప్రేక్షకులు తెలుగులోను ఈ సినిమా అందుబాటులోకి వస్తే బాగుండేదని అనుకున్నారు. అలాంటి ప్రేక్షకుల నిరీక్షణ త్వరలో ఫలించబోతోంది. ఈ నెల 12 నుంచి 'లయన్స్ గేట్ ప్లే' ఓటీటీలో తెలుగులోను అందుబాటులోకి రానుంది. ధ్యాన్ శ్రీనివాసన్ .. సిజూ విల్సన్ .. రోని డేవిడ్ రాజ్ .. కొట్టాయం నజీర్ ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించనున్నారు. 

కథ విషయానికి వస్తే, 1960లలో ఈ కథ మొదలవుతుంది. కేరళ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామం అది. అక్కడ చిన్న చిన్న దొంగతనాలు జరుగుతూ ఉంటే కనిపెట్టే డిటెక్టివ్ గా ఉజ్వలన్ ఉంటాడు. ప్రశాంతంగా ఉండే ఆ పల్లెలో ఒక్కసారిగా వరుస హత్యలు మొదలవుతాయి. ఈ విషయంలో అక్కడి పోలీసులు ఉజ్వలన్ సాయం కోరతారు. అప్పుడు అతను ఏం చేస్తాడు? హత్యలకు కారకులు ఎవరు? అనేది కథ. కామెడీ టచ్ తో సాగే ఈ మిస్టరీ థ్రిల్లర్ ను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. 

Go Back to Shorts
Detective Ujwalan
Malayalam thriller
Telugu dubbed movies
Dhyan Sreenivasan
Siju Wilson
Lionsgate Play
OTT releases
Malayalam movies
crime thriller
detective movies

More Telugu News