Pawan Kalyan: కల్యాణ్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు.. చిరు భావోద్వేగ పోస్ట్.. పవర్‌స్టార్‌కి బన్నీ స్పెషల్ విషెస్

Pawan Kalyan Birthday Wishes from Chiranjeevi and Allu Arjun
  • సోషల్ మీడియాలో తమ్ముడికి చిరంజీవి ఆత్మీయ సందేశం
  • పవన్ ప్రజాసేవ, అంకితభావం మరువలేనివన్న మెగాస్టార్
  • డిప్యూటీ సీఎంకు విషెస్ చెప్పిన అల్లు అర్జున్
  • పవన్‌తో దిగిన ఫొటోలను పంచుకున్న చిరంజీవి, బన్నీ
నేడు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు కుటుంబ సభ్యులు ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.

తన తమ్ముడు ప‌వ‌న్‌తో కలిసి ఉన్న ఒక పాత ఫొటోను పంచుకున్న చిరంజీవి, హృదయపూర్వక సందేశాన్ని పోస్ట్ చేశారు. "సినిమా రంగంలో అగ్ర నటుడిగా, ప్రజా జీవితంలో జనసేన నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నిరంతరం ప్రజలకు సేవ చేస్తున్న కల్యాణ్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు" అని చిరంజీవి పేర్కొన్నారు. "ప్రజాసేవలో నువ్వు చూపిస్తున్న అంకితభావం మరువలేనిది. ప్రజలందరి ఆశీస్సులతో, ఆప్యాయతతో సంపూర్ణ ఆరోగ్యంతో నూరేళ్లు జీవించి, ప్రజలకు మార్గనిర్దేశకుడిగా నిలవాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను" అంటూ మెగాస్టార్‌ తన పోస్టులో రాసుకొచ్చారు.

అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పవన్ కల్యాణ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్ తో కలిసి సంతోషంగా నవ్వులు చిందిస్తున్న ఒక ఫొటోను ఆయన షేర్ చేశారు. ఈ పోస్టుకు "మా పవర్‌స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు" అంటూ క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు అగ్ర హీరోలు పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు పవన్ కల్యాణ్‌కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Pawan Kalyan
Chiranjeevi
Allu Arjun
Janasena
AP Deputy CM
Telugu Cinema
Political Leader
Mega Family
Birthday Wishes
Social Media Post

More Telugu News