Kalvakuntla Kavitha: అమెరికా నుంచి హైదరాబాద్ కు తిరిగొచ్చిన కవిత... ఘన స్వాగతం

BRS MLC Kavitha Arrives in Hyderabad After America Tour
  • అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు ఎమ్మెల్సీ కవిత
  • కుమారుడి కాలేజీ అడ్మిషన్ కోసం అమెరికాకు వెళ్లిన కవిత
  • దాదాపు 15 రోజుల తర్వాత నగరానికి తిరిగొచ్చిన ఎమ్మెల్సీ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన అమెరికా పర్యటన ముగించుకుని ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. సుమారు 15 రోజుల తర్వాత ఆమె నగరానికి తిరిగి రావడంతో, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద బీఆర్ఎస్, జాగృతి శ్రేణులు పెద్ద ఎత్తున ఆమెకు ఘన స్వాగతం పలికాయి.

ఈ ఉదయం 11.15 గంటలకు కవిత శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమె రాక సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎయిర్‌పోర్టుకు భారీగా తరలివచ్చారు. ఇంటర్నేషనల్ అరైవల్స్ నుంచి ఆమె బయటకు రాగానే, కార్యకర్తలు పూలమాలలు వేసి, పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో విమానాశ్రయ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది.

తన చిన్న కుమారుడు ఆర్యను అమెరికాలోని ఒక కళాశాలలో చేర్పించడం కోసం ఎమ్మెల్సీ కవిత ఆగస్టు 16వ తేదీన అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్లిన ఆమె, పర్యటన పూర్తిచేసుకుని నగరానికి తిరిగొచ్చారు. 
Kalvakuntla Kavitha
Kavitha
BRS MLC
BRS
Telangana
Hyderabad Airport
America trip
Arya
Shamshabad Airport
Telangana Jagruthi

More Telugu News