గవర్నర్ హోదాలో సొంతగడ్డకు విచ్చేసిన అశోక్ గజపతిరాజు
- విజయనగరంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుకు ఘన స్వాగతం పలికిన అధికారులు
- స్వాగతం పలకడానికి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన అశోక్ గజపతిరాజు
- అశోక్ గజపతిరాజును సత్కరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
గోవా గవర్నర్ హోదాలో తొలిసారిగా విజయనగరం జిల్లాలోని తన స్వగృహానికి చేరుకున్న పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులకు ఘన స్వాగతం లభించింది. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, జిల్లా అధికారులు, పోలీసులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గవర్నర్ అశోక్ గజపతిరాజు అక్కడ ఉన్నవారిని ఆప్యాయంగా పలకరించారు. గోవా గవర్నర్ హోదాలో తొలిసారిగా తన నివాసానికి వచ్చిన అశోక్ గజపతిరాజును చూసి కుటుంబ సభ్యులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
కాగా, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అశోక్ గజపతిరాజును దుశ్శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అశోక్ గజపతిరాజుతో సమావేశమై పలు విషయాలపై చర్చించారు.