ఏపీలో గణేశ్ శోభాయాత్రలో విషాదం.. నలుగురి మృతి

  • నరసాపురం మండలం తూర్పుతాళ్ల గ్రామంలో ఘటన
  • గణేశ్ శోభాయాత్రలో ట్రాక్టర్ అదుపుతప్పి భక్తులపై దూసుకువెళ్లిన వైనం
  •  క్షతగాత్రులు నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం మండలం, తూర్పుతాళ్ల గ్రామంలో గణేష్ శోభాయాత్ర విషాదకరంగా ముగిసింది. శోభాయాత్రలో ట్రాక్టర్ అదుపు తప్పి భక్తులపైకి దూసుకువెళ్లడంతో నలుగురు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను తూర్పుతాళ్ల గ్రామానికి చెందిన సూర్యనారాయణ (52), మురళి (33), నరసింహమూర్తి (32), దినేశ్ (10)గా గుర్తించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News