అల్లు కనకరత్నం నేత్రదానంపై చిరంజీవి స్పందన

  • అల్లు కనకరత్నం కళ్లను దానం చేసిన కుటుంబ సభ్యులు
  • అవయవదానంలో నేత్రదానం మహా గొప్పదన్న మెగాస్టార్ చిరంజీవి
  • కనకరత్నం నేత్ర దానం ఎంతోమందికి స్పూర్తిదాయంగా నిలుస్తుందన్న చిరంజీవి
అవయవదానంలో నేత్రదానం ఎంతో గొప్పదని ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సినీ నిర్మాత అల్లు అరవింద్ మాతృమూర్తి, దివంగత అల్లు రామలింగయ్య అర్ధాంగి కనకరత్నం కళ్లను కుటుంబ సభ్యులు దానం చేసిన సందర్భంపై చిరంజీవి స్పందిస్తూ, ఆమె నేత్రదానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ అల్లు కనకరత్నం నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె బతికి ఉన్న సమయంలోనే చిరంజీవి చేపట్టిన బ్లడ్, ఐ డొనేషన్ వంటి కార్యక్రమాలకు ప్రభావితమై, తాను మరణించిన తర్వాత తన కళ్లను దానం చేయాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆ కోరిక మేరకు ఆమె మరణించిన తర్వాత కళ్లను అల్లు కుటుంబం దానం చేసింది. 


More Telugu News