అనుమతిస్తే బీజేపీ అగ్రనేతల మద్దతు కోరతాను: జస్టిస్ సుదర్శన్ రెడ్డి
- వ్యక్తిగత సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని, పార్టీలతో సంబంధం లేకుండా మద్దతివ్వాలని విజ్ఞప్తి
- తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఎంపీలందరికీ లేఖ రాశానన్న సుదర్శన్ రెడ్డి
- ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది రాజకీయ పార్టీలు కాదు.. ఎలక్టోరల్ కాలేజీ అన్న సుదర్శన్ రెడ్డి
వ్యక్తిగత సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుని, పార్టీలతో సంబంధం లేకుండా తనకు మద్దతు ఇవ్వాలని రాజ్యసభ, లోక్‌సభ సభ్యులందరినీ కోరుతున్నానని ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అనుమతి లభిస్తే, బీజేపీ అగ్రనేతల మద్దతు కోరేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతూ ఎంపీలందరికీ లేఖలు రాసినట్లు ఆయన వెల్లడించారు.
బీహార్‌లో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. మెజార్టీ ఉన్నంత మాత్రాన ఇష్టానుసారం వ్యవహరించడానికి అధికారం ఇచ్చినట్లు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను కేంద్రం ఇబ్బందులకు గురి చేసిందని ఆయన ఆరోపించారు. ఆయన వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసిందని ఆయన అన్నారు.
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఎన్డీయే కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి మద్దతు కూడగడుతున్నారు. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది రాజకీయ పార్టీలు కాదని, గౌరవ పార్లమెంటు సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ అని తెలిపారు. విచక్షణా శక్తితో ఓటు వేయాలని ప్రతి ఒక్క ఎంపీకి లిఖితపూర్వక అభ్యర్థన పంపుతున్నట్లు ఆయన చెప్పారు.