బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం
- రిజర్వేషన్లపై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ జీవో జారీ చేయాలని నిర్ణయం
- కోదండరామ్, అజారుద్దీన్లను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని కేబినెట్ నిర్ణయం
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అజారుద్దీన్లను ఎంపిక చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. గతంలో అమీర్ ఖాన్‌కు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఈసారి ఆయన స్థానంలో అజారుద్దీన్‌కు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు కోదండరామ్, అజారుద్దీన్‌ల పేర్లను సిఫార్సు చేస్తూ గవర్నర్‌కు పంపించింది.