యూఎస్‌లో 'ఓజీ' సెన్సేష‌న్... రిలీజ్‌కు ముందే రికార్డుల మోత

  • ప‌వ‌న్ క‌ల్యాణ్‌, సుజిత్ కాంబోలో ఓజీ
  • సెప్టెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న మూవీ
  • ఒక రోజు ముందుగానే యూఎస్‌లో ప్రీమియ‌ర్స్ ప్ర‌ద‌ర్శన‌
  • ప్రీమియర్స్‌కే ఐదు లక్షల డాలర్లకు పైగా ప్రీ సేల్స్ నమోదు
  • ఈ విష‌యాన్ని ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించిన మేక‌ర్స్
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, యువ ద‌ర్శ‌కుడు సుజిత్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన 'ఓజీ' అమెరికాలో సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తోంది. ఈ మూవీకి అత్యంత వేగంగా ఐదు ల‌క్ష‌ల డాల‌ర్ల ( (సుమారు రూ. 4.15 కోట్లు) )కు పైగా ప్రీమియ‌ర్స్ ప్రీ సేల్స్ జ‌రిగిన‌ట్లు మేక‌ర్స్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌క‌టించారు. 

"క్ష‌ణ‌క్ష‌ణ‌మొక త‌ల తెగి ప‌డెలే" అంటూ టైటిల్ సాంగ్‌లోని లిరిక్‌ను షేర్ చేసింది. కాగా, ఈ మూవీ సెప్టెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా ముందు రోజే (సెప్టెంబ‌ర్ 24న) అమెరికాలో ప్రీమియ‌ర్స్ ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. 

డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ ప్ర‌తినాయ‌కుడిగా నటిస్తుండగా.. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, నారా రోహిత్ కు కాబోయే భార్య సిరి లేళ్ల లాంటివారు కీలక పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. త‌మ‌న్ బాణీలు అందిస్తున్నారు. 


More Telugu News