షారుఖ్ ఖాన్, దీపికాలపై 420 కేసు.. కారణం ఇదే!

  • హ్యుండాయ్ కారుకు షారుఖ్, దీపికా ప్రమోషన్
  • అది చూసి తాను కారు కొన్నానని ఓ వ్యక్తి ఆరోపణ
  • ఆరు నెలల్లోనే కారులో తయారీ లోపాలు బయటపడ్డాయని ఆవేదన
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో పాటు ప్రముఖ నటి దీపికా పదుకొనెపై పోలీస్ కేసు నమోదైంది. వారితో పాటు పఠాన్ సినిమాకు పనిచేసిన మరో ఆరుగురిపైనా 420 సెక్షన్ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. షారుఖ్ ఖాన్ ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుండాయ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పఠాన్ సినిమా చిత్రీకరణ సమయంలో దీపికా పదుకొనె, మరో ఆరుగురితో కలిసి షారుఖ్ ఖాన్ హ్యుండాయ్ కారును ప్రమోట్ చేశారు.

ఈ ప్రమోషన్ వీడియో చూసి తాను ఆ మోడల్ కారు కొనుగోలు చేశానని, అయితే ఆరు నెలల తర్వాత కారులో తీవ్రమైన లోపాలు బయటపడ్డాయని రాజస్థాన్ కు చెందిన కీర్తి సింగ్ అనే వ్యక్తి ఆరోపించారు. లోపభూయిష్టమైన కారును ప్రమోట్ చేసిన షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనెలపై చర్యలు తీసుకోవాలంటూ కీర్తి సింగ్ కోర్టుకెక్కారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు షారుఖ్, దీపికాలతో సహా ఆరుగురిపై 420 కేసు నమోదు చేశారు.


More Telugu News