ఏపీ లిక్కర్‌ స్కామ్ కేసు... 12 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు

  • సెప్టెంబర్ 3 వరకు రిమాండ్ పొడిగింపు
  • సిట్ చార్జిషీట్‌లపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన న్యాయమూర్తి
  • రాజమండ్రి సెంట్రల్ జైలుకు మిథున్ రెడ్డి తరలింపు
ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సహా 12 మంది రిమాండ్‌ను ఏసీబీ కోర్టు సెప్టెంబర్ 3వ తేదీ వరకు పొడిగించింది. రిమాండ్ గడువు ముగియడంతో ఈరోజు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ పొడిగింపు నేపథ్యంలో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించగా, మరో 9 మంది నిందితులను విజయవాడ జిల్లా జైలుకు, ఇద్దరిని గుంటూరు జైలుకు తరలించారు. 

 మరోవైపు, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ దాఖలు చేసిన చార్జిషీట్‌లపై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రెండు ఛార్జ్‌షీట్లలో 21కి పైగా అభ్యంతరాలున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. నిందితులు అందరికీ ముద్దాయి కాపీలు అందజేశారా? అని ప్రశ్నించారు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం ఎలా వర్తిస్తుందో చెప్పాలని అడిగారు. దాఖలు చేసిన డాక్యుమెంట్లకు సరైన క్రమ సంఖ్యలు లేవని, వాటిని సరిచేసి మళ్లీ అందించాలని స్పష్టం చేశారు.


More Telugu News