ఢిల్లీలో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు
  • మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి
  • రిజర్వేషన్ల అమలుపై సలహాలు తీసుకోవడానికి ఢిల్లీకి వచ్చినట్లు భట్టి విక్రమార్క వెల్లడి
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో సమావేశమయ్యారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా చూసేందుకు సలహాలు తీసుకోవడానికి ఢిల్లీకి వచ్చినట్లు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని కలిసి న్యాయ సలహాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు మంగళవారం ఢిల్లీ పర్యటనను ముగించుకుని బీహార్‌కు వెళ్లనున్నారు.


More Telugu News