బీజేపీకి షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు ఆలూరి విజయభారతి
బీఆర్ఎస్‌లో తిరిగి చేరిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు ఆలూరు విజయభారతి
రెండేళ్ల క్రితం పార్టీని వీడటం పొరపాటని అంగీకారం
గతంలో తీసుకున్న నిర్ణయం పట్ల క్షమాపణ కోరిన నేత
కమలం పార్టీకి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్న విజయ భారతి

తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు ఆలూరు విజయభారతి పాతగూటికి చేరారు. ఆమె బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగొచ్చారు. సుమారు రెండేళ్ల క్రితం బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరడం తాను చేసిన పొరపాటని ఆమె అంగీకరించడం గమనార్హం.
గతంలో బీఆర్ఎస్ పార్టీలో చురుగ్గా పనిచేసిన ఆలూరు విజయభారతి, రెండేళ్ల క్రితం ఆ పార్టీని వీడి కమలం గూటికి చేరారు. బీజేపీలో ఆమెకు రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలిగా బాధ్యతలు అప్పగించారు. అయితే, తాజాగా ఆమె తన రాజకీయ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకున్నారు. బీజేపీకి రాజీనామా చేసి, తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
ఈ సందర్భంగా, రెండేళ్ల క్రితం బీఆర్ఎస్‌ను వీడి వెళ్లాలన్న తన నిర్ణయం సరైనది కాదని ఆమె పేర్కొన్నారు. ఆనాడు తాను తీసుకున్న నిర్ణయం పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, ఆమె క్షమాపణలు కోరారు. "ఈ సభాముఖంగా మీ అందరి ముందు ఒకటి చెబుతున్నాను. రామన్నా (కేటీఆర్) ఐయామ్ వెరీ సారీ. రెండేళ్ల క్రితం నేను ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. మీరు ఎప్పుడైతే వెల్‌కం బ్యాక్ హోం అన్నారో.. ఎక్కడో పరాయి దేశం నుంచి నా ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉంది" అని ఆమె అన్నారు. ఇకపై తన రాజకీయ ప్రస్థానం బీఆర్ఎస్ పార్టీతోనే కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.