తెలంగాణ ఆరోగ్య శాఖలో 1623 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
––
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 1623 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నియామక ప్రకటన జారీ చేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో 1616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులతో పాటు ఆర్టీసీ ఆసుపత్రుల్లో 7 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హత కలిగిన వైద్యులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. వచ్చే నెల 8 న ప్రారంభం కానున్న దరఖాస్తు పక్రియ అక్టోబర్ 22వ తేదీన ముగుస్తుందని తెలిపింది.
జోన్ ల వారీగా భర్తీ చేపట్టనున్న ఈ పోస్టులలో మల్టీజోన్ 1లో 858, మల్టీజోన్ 2లో 765 ఖాళీలు వున్నాయి. కాంట్రాక్ట్ విధానంలో ఇప్పటికే పనిచేస్తున్న వైద్యులకు పోస్టుల భర్తీలో 20 పాయింట్లు కేటాయిస్తామని అధికారులు వివరించారు. కాగా, విభాగాల వారీగా పోస్టులు, ఇతర అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడాలని పేర్కొన్నారు.