కాంగ్రెస్, బీజేపీ ఉచ్చులో పడకండి.. బీహారీలకు ప్రశాంత్ కిశోర్ హెచ్చరిక

  • బీహార్ లో అసలు సమస్యలను ఆ రెండు పార్టీలు పట్టించుకోవట్లేదని విమర్శ
  • ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయంటూ ఆగ్రహం
  • వలసలు, అవినీతి, విద్యా సౌకర్యాల కొరత వంటి సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపణ
బీహార్ ప్రజలను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలను వదిలేసి ‘ఓట్ చోరీ’ పైనే పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయని అన్నారు. ఆర్జేడీ పార్టీ సూచనల ప్రకారమే రాహుల్ గాంధీ నడుచుకుంటున్నాడు తప్ప బీహారీల సమస్యలపై ఆయన దృష్టి పెట్టడంలేదని మండిపడ్డారు.

ఎన్నికల వేళ రాహుల్ గాంధీని నరేంద్ర మోదీ, నరేంద్ర మోదీని రాహుల్ గాంధీ పరస్పరం విమర్శించుకుంటున్నారని చెప్పారు. ఆ పార్టీల ఉచ్చులో పడొద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. బీహార్ లో అసలైన సమస్యలు పేదరికం, నిరుద్యోగం, వలసలు, సరైన విద్యా సౌకర్యాలు లేకపోవడం.. వంటి వాటిని ప్రధాన పార్టీలు గాలికి వదిలేశాయని ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు, ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రజల కోసం ‘జన్ సూరజ్ పార్టీ’ ఆవిర్భవించిందని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.


More Telugu News