ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన

  • సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్ సమరం
  • ఇప్పటికే జట్లను ప్రకటించిన భారత్, పాక్
  • తాజాగా 16 మందితో బంగ్లాదేశ్ జట్టు ఎంపిక
మరికొన్ని రోజుల్లో ఆసియా క్రికెట్ సమరానికి తెరలేవనుంది. టీ20 ఫార్మాట్లో  జరిగే ఈ క్రికెట్ యుద్ధం సెప్టెంబరు 9 నుంచి సెప్టెంబరు 28 వరకు యూఏఈలో నిర్వహించనున్నారు.  ఇప్పటికే టీమిండియా, పాకిస్థాన్ ఆసియా కప్ టోర్నీ కోసం తమ జట్లను ప్రకటించాయి. తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా 16 మందితో జట్టును ప్రకటించింది. 

లిట్టన్ దాస్ కెప్టెన్సీలో అనుభవజ్ఞులు, యువకుల కలబోతగా జట్టు ఎంపిక జరిగింది. ఆసియా కప్ టోర్నీలో ఈసారి మ్తొతం 8 జట్లు పాల్గొంటుండగా... వాటిని రెండు గ్రూపులు చేశారు. గ్రూప్-ఏ లో భారత్, పాకిస్థాన్, యూఏఈ, ఒమన్ జట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్ జట్టు శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, హాంకాంగ్ జట్లతో కలిసి గ్రూప్-బి లో ఉంది. 

బంగ్లాదేశ్ జట్టు
లిట్టన్ దాస్ (కెప్టెన్), నురుల్ హసన్ (వికెట్ కీపర్), తాంజిద్ హుస్సేన్, పర్వేజ్ ఇమాన్, తౌహీద్ హృదయ్, సైఫ్ హసన్, జకీర్ అలీ (వికెట్ కీపర్), షమీమ్ హుస్సేన్, రిషాద్ హుస్సేన్, నసూమ్ అహ్మద్, ముస్తాఫిజూర్ రెహ్మాన్, తాంజిమ్ సకిబ్, మెహదీ హసన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లామ్, సైఫుద్దీన్.


More Telugu News