స్కూల్‌లో నిద్రపోయిన చిన్నారి.. తాళం వేసి వెళ్లిపోయిన సిబ్బంది.. కిటికీలో ఇరుక్కుపోయిన తల.. రాత్రంతా నరకయాతన!
- ఒడిశాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో దారుణ ఘటన
- కిటికీ నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలో తీవ్ర గాయాలు
- కిటికీ ఊచల మధ్య ఇరుక్కుపోయిన పాప తల
- స్కూల్ సిబ్బందిపై గ్రామస్థుల తీవ్ర ఆగ్రహం
ఒడిశాలో పాఠశాల సిబ్బంది ఘోర నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. స్కూల్ గదిలోనే నిద్రపోయిన రెండో తరగతి బాలికను గమనించకుండా తాళం వేసి వెళ్లిపోవడంతో ఆ పాప రాత్రంతా నరకయాతన అనుభవించింది. బయటకు వచ్చే ప్రయత్నంలో కిటికీ ఊచల మధ్య తల ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడింది. ఈ హృదయ విదారక ఘటన కియోంఝర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది.
గురువారం సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే, రెండో తరగతి చదువుతున్న ఓ బాలిక తరగతి గదిలోనే నిద్రలోకి జారుకుంది. ఆ చిన్నారి లోపల ఉన్న విషయాన్ని గమనించని సిబ్బంది గదికి తాళం వేసి వెళ్లిపోయారు. రాత్రి అయినా పాప ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కలిసి రాత్రంతా గాలించినా ఫలితం లేకపోయింది.
ఉదయాన్నే పాఠశాల వద్దకు వెళ్లిన గ్రామస్థులకు ఓ గది కిటికీ ఊచల మధ్య తల ఇరుక్కుని, తీవ్ర గాయాలతో వేలాడుతున్న చిన్నారి కనిపించింది. ఆ దృశ్యం చూసి చలించిపోయిన వారు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న సహాయక బృందాలు ఎంతో శ్రమించి బాలికను బయటకు తీసి ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై పాఠశాల టీచర్ సంజిత స్పందిస్తూ "సాధారణంగా మా స్కూల్ వంట మనిషి గదులకు తాళాలు వేస్తారు. కానీ భారీ వర్షం కారణంగా ఆయన రాలేదు. సాయంత్రం 4:10 గంటలకు మేము గదులు మూసేటప్పుడు ఏడో తరగతి విద్యార్థులిద్దరిని తాళాలు వేయమని పంపించాం. అయితే, రెండో తరగతి పాప బెంచీ కింద నిద్రపోవడంతో ఆ విద్యార్థులు గమనించలేదు" అని వివరించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. దీంతో జిల్లా యంత్రాంగం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.