ఢిల్లీలో రామ్మోహన్ నాయుడు నివాసానికి చంద్రబాబు... చిన్నారికి ఆశీస్సులు
- శుక్రవారం నాడు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన
- రామ్మోహన్ నాయుడు దంపతులకు ఇటీవల జన్మించిన కుమారుడికి ఆశీస్సులు
- పసిబిడ్డను ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుని దీవెనలు అందించిన ముఖ్యమంత్రి
- రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించిన చంద్రబాబు
- ఆత్మీయ పలకరింపుతో సందడిగా మారిన కేంద్రమంత్రి నివాసం
ఈ సందర్భంగా, రామ్మోహన్ నాయుడు కుమారుడిని చంద్రబాబు ఆప్యాయంగా ఎత్తుకుని ఆశీర్వదించారు. చిన్నారికి తన దీవెనలు అందించి, ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం, రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఆత్మీయ పలకరింపుతో రామ్మోహన్ నాయుడు నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి రాక పట్ల ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

