ఖ‌ర్గేతో వైసీపీ ఎంపీ మేడా ర‌ఘునాథ‌రెడ్డి భేటీ

  • నిన్న ఏఐసీసీ అధ్య‌క్షుడు ఖ‌ర్గేను ఆయ‌న నివాసంలో క‌లిసిన వైసీపీ ఎంపీ
  • ఇది కేవలం మ‌ర్యాద‌పూర్వ‌క భేటీయేన‌ని ర‌ఘునాథ‌రెడ్డి వెల్ల‌డి
  • ఒక స్నేహితుడిగా మాత్ర‌మే తాను ఖ‌ర్గేను క‌లిసిన‌ట్లు స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • దీనికి రాజ‌కీయాలు ఆపాదిస్తూ వ‌క్రీక‌రించ వ‌ద్ద‌ని కోరిన వైనం 
వైసీపీ ఎంపీ మేడా ర‌ఘునాథ‌రెడ్డి నిన్న మ‌ధ్యాహ్నం ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గేను ఆయ‌న నివాసంలో క‌లిశారు. అయితే, ఇటీవ‌ల ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఎన్‌డీఏ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు వైసీపీ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆ పార్టీ నేత కాంగ్రెస్ అధ్య‌క్షుడిని క‌ల‌వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్రాధాన్యం సంత‌రించుకొంది. 

కాగా, ఇలా కాంగ్రెస్ అధ్య‌క్షుడిని క‌ల‌వ‌డంపై వైసీపీ ఎంపీ స్పందించారు. తాను కేవ‌లం మ‌ర్యాద‌పూర్వ‌కంగానే ఖ‌ర్గేను క‌లిసిన‌ట్లు ర‌ఘునాథ‌రెడ్డి తెలిపారు. ఆయ‌న క‌ర్ణాట‌క హోంమంత్రిగా ఉన్న‌ప్ప‌టి నుంచి త‌న‌కు ప‌రిచ‌యం ఉంద‌ని,  ఆ ప‌రిచ‌యం మేర‌కు ఇప్పుడు క‌లిసిన‌ట్లు వెల్ల‌డించారు. ఇది స్నేహ‌పూర్వ‌క స‌మావేశం మాత్ర‌మేన‌ని, దీనిపై అత్యుత్సాహం చూపించాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. 

దీనికి రాజ‌కీయాలు ఆపాదిస్తూ వ‌క్రీక‌రించ వ‌ద్ద‌ని ఆయ‌న కోరారు. గ‌తేడాది కాలంగా త‌న‌పై ప‌లుమార్లు ఇలాంటి ప్ర‌చారాలు చేశార‌ని ఆరోపించారు. తాను వైసీపీ పార్టీ ఎంపీన‌ని, త‌న ప్ర‌యాణం జ‌గ‌న్ వెంటేన‌ని ర‌ఘునాథ‌రెడ్డి స్పష్టం చేశారు.   


More Telugu News