అటు సౌబిన్ క్రేజ్ .. ఇటు రజనీ గొప్పతనం!
- రీసెంటుగా రిలీజైన 'కూలీ'
- విడుదలైన ప్రతిచోటా వసూళ్ల వర్షం
- హైలైట్ గా నిలిచిన సౌబిన్ షాహిర్ రోల్
- ఒక్కసారిగా పెరిగిపోయిన క్రేజ్
- ఆయన పాత్రనే హాట్ టాపిక్
రజనీకాంత్ కథానాయకుడిగా .. నాగార్జున ప్రతినాయకుడిగా నటించిన 'కూలీ' భారీ వసూళ్లను రాబడుతూ వెళుతోంది. అయితే ఈ సినిమా చూసిన వాళ్లు సౌబిన్ షాహిర్ గురించి మాట్లాడుకోవడం విశేషం. ఈ సినిమాలో ఉపేంద్ర .. ఆమీర్ ఖాన్ ఉన్నారు. అయినా సౌబిన్ షాహిర్ పాత్రనే ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. మలయాళంలో సౌబిన్ ఆల్రెడీ స్టార్. అయినా ఇప్పుడు అక్కడ ఆయన రేంజ్ పూర్తిగా మారిపోయిందని అంటున్నారు.
మలయాళం సినిమాలలో డాన్సులు గట్రా ఉండవు. ఒకవేళ ఉన్నా సౌబిన్ తరహా ఆర్టిస్టులకు అలాంటి అవకాశం రాదు. అనుకోకుండా 'కూలీ'తో వచ్చిన ఈ అవకాశాన్ని సౌబిన్ పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నాడు. ఆయనలోని కొత్త కోణాన్ని చూసి, మలయాళ ఇండస్ట్రీనే షాక్ అయింది. ఇప్పుడు ఉత్తరాదిన .. దక్షిణాదిన కూడా అక్కడి దినపత్రికలు .. వెబ్ సైట్లు సౌబిన్ గురించే రాస్తున్నాయి. టీవీ ఛానల్స్ ఆయన గురించిన స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి.
సౌబిన్ కి ఇతర భాషల్లోను ఒక్కసారిగా పెరిగిపోయిన క్రేజ్ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఆయన బాగా చేశాడని చెప్పుకుంటున్నవారు కొందరతే, ఆయన పాత్ర ఆ స్థాయిలో హైలైట్ అవుతుందని తెలిసి రజనీ ఒప్పుకోవడం గొప్ప విషయమని మరికొందరు అనుకుంటున్నారు. కొంతమంది హీరోలు, మిగిలిన పాత్రలు తమ పాత్రకి మించి హైలైట్ కాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అవసరమైతే ఎడిటింగ్ టేబుల్ దగ్గరే లేపేస్తూ ఉంటారు. అలా కాకుండా సౌబిన్ పాత్రకు స్వేచ్ఛను ఇచ్చి, లోకేశ్ డిజైన్ చేసిన విధంగానే ఆ పాత్రను జనంలోకి వెళ్లేలా చేయడం రజనీ కాంత్ గొప్పతనమేననేది ఆయన ఫ్యాన్స్ మాట.