అండర్ పాస్ లో చిక్కుకున్న కారు.. ఈదుకుంటూ వెళ్లి కాపాడిన స్థానికులు.. వీడియో ఇదిగో!
- ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు
- వాగులు, నదులను తలపిస్తున్న వీధులు
- థానే అండర్ పాస్ లో నడుములోతు వరద
ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వీధులన్నీ జలమయంగా మారాయి. థానే జిల్లా నారీవలి, ఉత్తరశివ్ గ్రామాల మధ్య ఉన్న అండర్ పాస్ లోకి భారీగా వరద చేరింది. ఈ విషయం తెలియక అండర్ పాస్ లోకి ప్రవేశించిన ఓ కారు మధ్యలోనే ఆగిపోయింది. నడుములోతు నీటిలో కారు దాదాపుగా మొత్తం మునిగిపోయింది. దీంతో కారులోని ఇద్దరు వ్యక్తులు సాయం కోసం కేకలు వేయగా.. అక్కడున్న స్థానిక యువకులు స్పందించారు. ఈదుకుంటూ వెళ్లి కారును తోసేందుకు ప్రయత్నించారు.
అయినా కారు ముందుకు కదలకపోవడంతో లోపల ఉన్న వ్యక్తులను బయటకు తీసి రోడ్డుపైకి చేర్చారు. ఈ ఉదంతాన్ని ఓ యువకుడు తన ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. కాగా, ముంబై సహా రాయ్ గఢ్, థానే, నవీ ముంబై తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. కళ్యాణ్ లో కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.