ఆ స్టార్ హీరోతో షూటింగ్ అంత ఈజీ కాదు: మురుగదాస్

  • ఒకప్పుడు భారీ హిట్స్ ఇచ్చిన మురుగదాస్
  • కోలీవుడ్ కి కొత్త టేకింగ్ ను పరిచయం చేసిన డైరెక్టర్   
  • ఈ మధ్య కాలంలో పలకరించని సక్సెస్ 
  • పరాజయం పాలైన 'సికందర్'
  • అసహనంతో ఉన్న మురుగదాస్   

మురుగదాస్ .. కోలీవుడ్ సినిమాకు కొత్త పరుగు నేర్పిన డైరెక్టర్. ఒకప్పుడు శంకర్ తరువాత మురుగదాస్ పేరే కోలీవుడ్ లో ఎక్కువగా వినిపించేది. సీనియర్ స్టార్ హీరోలతో సైతం భారీ సినిమాలు తీసి, సంచలన విజయాలను నమోదు చేసిన రికార్డ్ మురుగదాస్ కి ఉంది. కథ - స్క్రీన్ ప్లే పై ఆయనకి మంచి గ్రిప్ ఉంది. ఆయన సినిమాల రీమేక్ రైట్స్ కూడా హాట్ కేకుల మాదిరిగా అమ్ముడైన సందర్భాలు ఉన్నాయి.

 తమిళ .. తెలుగు స్టార్స్ తో మాత్రమే కాదు, బాలీవుడ్ సీనియర్ స్టార్స్ తోను కలిసి పనిచేసిన అనుభవం ఆయనకి ఉంది. అయితే ఎప్పుడూ కూడా ఆయన ఏ హీరో గురించి ఎక్కడా అసహనాన్ని వ్యక్తం చేసింది లేదు. కానీ తాజాగా ఒక ఇంటర్యూలో మాట్లాడుతూ, ఒక బాలీవుడ్ స్టార్ హీరో గురించి ప్రస్తావించాడు. ఆ హీరో రాత్రి 8 గంటలకు షూటింగుకు వచ్చేవారు. పగలు చేయవలసిన సన్నివేశాలను కూడా రాత్రివేళలో షూట్ చేయవలసి వచ్చేది. అందుకోసం నానా తిప్పలు పడేవాళ్లం" అని అన్నాడు. 

" ఆ సమయంలో పిల్లల కాంబినేషన్ లోని సన్నివేశాలను చిత్రీకరించడం కష్టంగా ఉండేది. ఆ సమయానికి వాళ్లు చాలా అలసిపోయేవారు. ఆ హీరో టైమింగ్స్ కారణంగా ఆయనతో పని చేయడం అంత ఈజీ కాదని అనిపించింది" అని చెప్పాడు. ఇటీవల సల్మాన్ తో మురుగదాస్ 'సికందర్' సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్ ను ఉద్దేశించే మురుగదాస్ ఈ మాట అన్నాడనే టాక్ వినిపిస్తోంది. 



More Telugu News